Edukondalekkalani Mokkesanu
演唱:Padaala Savvadi、Dhanunjay Seepanaఏడుకొండలెక్కాలని మొక్కేశాను
వీరుడిలా తలపాగా చుట్టేశాను
ఎండనకా వాననకా వచ్చేశాను
నడుంకట్టి నడకదారి పట్టేశాను
గోవిందా… గోవిందా… గోవిందా
గోవిందా…గోవిందా… గోవిందా
1 గరుడాద్రి చూశాక గుబులేదో మొదలాయె
వృషభాద్రి వచ్చాక అడుగే మరి పడదాయే
అంజనాద్రి వెళ్లినా అగుపడదే గోపురం
నీలాద్రి దాటినా ఎకడోనీ స్థావరం
నీ నామం ఇకనైనా కనిపిస్తుందా
నీ స్మరణం ఇపుడైనా వినిపిస్తుందా #గోవిందా#
2 శేషాద్రి శిఖరంలో వచ్చిందో సంకేతం
వేంకటాద్రిలో వేగం పెంచమన్న సందేశం
మిగిలిన మోకాళ్ళ మెట్లు ఎక్కేస్తాలే
నారాయణాద్రినీ దాటేస్తాలే
ఈ పందెం నేనింక గెలిచేస్తున్నా
పరిగెడుతూ నీ దరికే చేరేస్తున్నా #గోవిందా#
3 నిను చూసిన ఆ క్షణమే అరుదైన వరమాయె
వీడని ఓ ఋణమేదో మరలా నీ పిలుపాయె
వెళ్ళినట్టె వెళ్ళి తిరిగొచ్చేస్తాలే
భారమంత నీ పైనే పెట్టేస్తాలే
ఇలపైకే నువు కాస్త దిగివస్తావో
గాలిలో ఎగిరొచ్చే వరమిస్తావో #గోవిందా#
వీరుడిలా తలపాగా చుట్టేశాను
ఎండనకా వాననకా వచ్చేశాను
నడుంకట్టి నడకదారి పట్టేశాను
గోవిందా… గోవిందా… గోవిందా
గోవిందా…గోవిందా… గోవిందా
1 గరుడాద్రి చూశాక గుబులేదో మొదలాయె
వృషభాద్రి వచ్చాక అడుగే మరి పడదాయే
అంజనాద్రి వెళ్లినా అగుపడదే గోపురం
నీలాద్రి దాటినా ఎకడోనీ స్థావరం
నీ నామం ఇకనైనా కనిపిస్తుందా
నీ స్మరణం ఇపుడైనా వినిపిస్తుందా #గోవిందా#
2 శేషాద్రి శిఖరంలో వచ్చిందో సంకేతం
వేంకటాద్రిలో వేగం పెంచమన్న సందేశం
మిగిలిన మోకాళ్ళ మెట్లు ఎక్కేస్తాలే
నారాయణాద్రినీ దాటేస్తాలే
ఈ పందెం నేనింక గెలిచేస్తున్నా
పరిగెడుతూ నీ దరికే చేరేస్తున్నా #గోవిందా#
3 నిను చూసిన ఆ క్షణమే అరుదైన వరమాయె
వీడని ఓ ఋణమేదో మరలా నీ పిలుపాయె
వెళ్ళినట్టె వెళ్ళి తిరిగొచ్చేస్తాలే
భారమంత నీ పైనే పెట్టేస్తాలే
ఇలపైకే నువు కాస్త దిగివస్తావో
గాలిలో ఎగిరొచ్చే వరమిస్తావో #గోవిందా#